![]() |
![]() |

బుల్లితెర మీద జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్(Mukku Avinash) గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సందడి చేసాడు. ఐతే అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజాని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం వరకు అన్ని విషయాలను కూడా తన ఫాన్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఐతే ఇప్పుడు ఒక విషాదకర సంఘటన గురించి కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా చెప్పి చాలా బాధపడ్డాడు.
"నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ" మీ అనూజ అవినాష్ అంటూ ఒక సుదీర్ఘ మెసేజ్ ని రాసాడు.

ఇంతకు ఏమైందో ఎలా బేబీని కోల్పోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. అడిగి బాధపెట్టొద్దని చెప్పడంతో నెటిజన్స్ కూడా ఆ విషయం గురించి అడిగే ప్రయత్నం చేయలేదు. "సారీ ఫర్ యువర్ లాస్..జాగ్రత్తగా స్ట్రాంగ్ గా ఉండండి.." అని కొందరు, "మీరు తండ్రి కాబోతున్న విషయాన్ని షేర్ చేసుకోకూడదు...ఈసారి మాత్రం కొంచెం సీక్రెట్ గా ఉంచు ఏ విషయాన్ని ఐనా.. దేవుడు కరుణిస్తాడు త్వరలోనే మీకు మరో బిడ్డ పుడుతుంది " అని కొందరు సలహాలు ఇస్తున్నారు.
![]() |
![]() |